చిరు “భోళా శంకర్” సాంగ్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Feb 9, 2023 1:19 am IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” తో తన కెరీర్ లో సెన్సేషనల్ కం బ్యాక్ ని తాను ఇచ్చారు. ఇక దీనితో నెక్స్ట్ మాస్ డ్రామా “భోళా శంకర్” కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉండగా ఈ సినిమా షూటింగ్ ని దర్శకుడు మెహర్ రమేష్ ఫుల్ స్వింగ్ లో భారీ సెట్స్ నడుమ కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ అదిరే సాంగ్ పై అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది.

మరి ప్రస్తుతం ఈ చిత్రంలో ఓ డాన్స్ బ్లాస్ట్ సాంగ్ షూటింగ్ ని మేకర్స్ చేస్తున్నారట. ఈ సాంగ్ ని కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నే కంపోజ్ చేయగా ఈ సాంగ్ కూడా ఓ సాలిడ్ సెట్ వర్క్ లో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారట. మరి చిరు కెరీర్ లో ఎన్నో చార్ట్ బస్టర్స్ ఇచ్చిన మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మరి తాను ఎలాంటి మ్యూజిక్ ని బాస్ కోసం అందించాడో చూడాలి.

సంబంధిత సమాచారం :