చియాన్ విక్రమ్ కోబ్రా పై ఇంట్రెస్టింగ్ అప్డేట్

cobra

చియాన్ విక్రమ్ కోబ్రా అనే సీరియస్ అండ్ డేంజరస్ టైటిల్ తో వస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగో డిజైన్ కూడా రెండు విష సర్పాల మధ్య కిరీటంతో ఆసక్తిరేపేదిలా ఉంది. విక్రమ్ 58వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈమూవీలో ఆయన ఏకంగా 25 గెటప్స్ లో కనిపించనున్నారని సమాచారం. దర్శకుడు అజయ్ జ్ఞాన ముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి కాగా మిగతా సగభాగం షూటింగ్ యూరోప్ ఖండంలోని వివిధ దేశాలలో చిత్రీకరించనున్నారు.

తమిళంతో పాటు తెలుగు మరియు హిందీ భాషలలో కూడా కోబ్రా అనే టైటిల్ తో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక జనవరి 26న రిపబ్లిక్ డే సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తారట. 2020 సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చుతున్నారు.

Exit mobile version