మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఒకరైన స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో మరో హిట్ గా నిలిచి అదరగొట్టింది. అయితే ఈ చిత్రంని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించగా సాలిడ్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా అందుకుంటూ దుమ్ము లేపుతుంది. అయితే లేటెస్ట్ గా డాకు మహారాజ్ సక్సెస్ మీట్ పై క్లారిటీ వచ్చింది.
ఈ చిత్రం రిలీజ్ కి ముందు అనంతపురంలో ప్లాన్ చేసిన గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎలా ఆగిపోయిందో తెలిసిందే. అయితే ఇపుడు సక్సెస్ మీట్ని కూడా అదే అనంతపురంలో మేకర్స్ ఫిక్స్ చేశారు. అనంతపురం శివారు శ్రీనగర్ కాలనీ దగ్గర ఈవెంట్ ని ఈరోజే చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈవెంట్ కి వచ్చే ప్రజలు కేవలం పాసులు ఉన్నవారికే అలాగే సాయంత్రం 5 లోపే వేదిక దగ్గరకి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ఈవెంట్ లో హైలైట్స్ ఎలా ఉంటాయో చూడాలి.