‘దేవర’ పై యాక్షన్‌ మళ్లీ మొదలు !

Published on Sep 19, 2023 10:02 am IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. సైమా అవార్డ్స్ కోసం ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాడు. ఐతే, దుబాయ్ నుంచి ఎన్టీఆర్ తిరిగి రావడంతో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ పై క్లారిటీ వచ్చింది. రేపటి నుంచి ఎన్టీఆర్ పై సోల్మన్ మాస్టర్ కొరియోగ్రఫీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ షెడ్యూల్ లో జూ.ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ లు కూడా పాల్గొనబోతున్నారని టాక్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.

కాగా ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరగనుంది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి.. ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :