ధనుష్ “సార్” రిలీజ్ పై లేటెస్ట్ క్లారిటీ.!

ధనుష్ “సార్” రిలీజ్ పై లేటెస్ట్ క్లారిటీ.!

Published on Oct 30, 2022 7:01 AM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా చేస్తున్నటువంటి పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో తెలుగు లో కూడా చేస్తున్న చిత్రాలు ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో అయితే మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న బై లాంగువల్ చిత్రం “సార్” కూడా ఒకటి. మరి ఆసక్తికరమైన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ పై అయితే ఆ మధ్య కొన్ని రూమర్స్ వినిపించాయి.

బహుశా ఈ సినిమా రిలీజ్ ఈ ఏడాదిలో ఉండకపోవచ్చని టాక్ రాగా ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే సినిమా అనుకున్నట్టుగా ఈ డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీత దర్శకుడిగా పని చేస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు