ధనుష్ “సార్” చిత్రం నుండి లేటెస్ట్ అప్డేట్!

Published on Feb 1, 2023 9:15 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గత చిత్రం నేనే వరువెన్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అతని తదుపరి విడుదల తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన తమిళ – తెలుగు ద్విభాషా చిత్రం వాతి/సార్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో అభిమానులు చిత్ర బృందం నుండి అప్డేట్‌లను అభ్యర్థిస్తున్నారు.

ప్రొడక్షన్ హౌస్ తన తాజా ట్వీట్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఆడియో గురించిన అప్డేట్ త్వరలో వస్తుందని పేర్కొంది. దేశంలోని విద్యావ్యవస్థలో అవినీతిని వెలుగులోకి తెచ్చే ఈ చిత్రంలో ధనుష్‌ సరసన హీరోయిన్ గా సంయుక్తా మీనన్ నటిస్తుంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :