‘రాజశేఖర్’ శేఖర్ రిలీజ్ ఓటీటీలోనే !

‘రాజశేఖర్’ శేఖర్ రిలీజ్ ఓటీటీలోనే !

Published on Sep 6, 2021 11:06 PM IST

సీనియర్ హీరో ‘రాజశేఖర్’ ప్రస్తుతం నటిస్తున్న మూవీ… శేఖర్. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ చివరి దశలో ఉంది. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా పూర్తి కానుంది. అయితే ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత ఈ రీమేక్ చేస్తున్నాడు.

కాగా మలయాళంలో సూపర్ హిట్టయిన ఒక క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ఈ ‘శేఖర్’ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అను సితార, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజశేఖర్ కి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా హిట్ కావాలి, అందుకే ఈ సినిమా కోసం కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడట.

నిజానికి ‘గరుడవేగ’తో రాజశేఖర్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. కానీ, ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’తో ఆ క్రేజ్ పోవడంతో రాజశేఖర్ ఈ శేఖర్ సినిమా పైనే ఆశలు అన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ పై గట్తి నమ్మకంతోనే ఉన్నాడు. సినిమా కూడా బాగానే వస్తోందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు