మే 1 నుంచి ‘గేమ్ ఛేంజర్’ కొత్త షెడ్యూల్

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. ఐతే, ఈ సినిమా కొత్త షెడ్యూల్ పై కొత్త అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ మే 1 నుంచి చెన్నైలో జరగనుందట. హైదరాబాద్ షెడ్యూల్ నిన్న పూర్తయిందని టాక్. శంషాబాద్‌లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వచ్చే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయ్యింది. కథ ప్రకారం ఈ షెడ్యూల్ చాలా కీలకం అని, ఈ షెడ్యూల్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చరణ్ సీనియర్ పాత్ర పై ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను పెడుతున్నాడు శంకర్. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.

Exit mobile version