గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాని మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించగా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అలాగే శంకర్ నుంచి భారతీయుడు 2 లాంటి డిజప్పాయింట్మెంట్ తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో అంచనాలతో పాటుగా అనుమానాలు కూడా ఉన్నాయి.
కానీ మేకర్స్ మాత్రం ఇది శంకర్ మార్క్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమా నుంచి పాటలు కాదు టీజర్ లాంటిది కావాలని అభిమానులు అయితే ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ టీజర్ ని సినిమా డిసెంబర్ వాయిదా లేకుండా ఉంటే మొన్న దసరా కానుకగానే తీసుకురావాల్సి ఉంది కానీ దానిని ఆపారు.
అయితే ఇప్పుడు మరోసారి బజ్ అయితే వినిపిస్తుంది. దీనితో ఈ దీపావళి కానుకగా గాని లేదా నవంబర్ లోనే టీజర్ ఉండొచ్చు అన్నట్టుగా బజ్ వినిపిస్తుంది. అలాగే టీజర్ ఊహించని రీతిలో ఉండబోతోందని తెలుస్తోంది అలాగే దీని తర్వాత అంచనాలు మరింత ఎక్కువ అవుతాయని కూడా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ కోసం అయితే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ చూస్తే గాని సినిమాపై ఒక క్లారిటీ వచ్చేలా లేదని అంతా ఎదురు చూస్తున్నారు.