గోపీచంద్ సినిమాలో స్పెషల్ ట్రాక్

Published on Oct 3, 2023 3:00 am IST

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఓ స్పెషల్ కామెడీ ట్రాక్ ఉంది. ఇప్పుడు ఈ ట్రాక్ కోసం ఓ భారీ సెట్ ను వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి శ్రీనువైట్ల, గోపీచంద్ తో ఏ రేంజ్ లో కామెడీ ట్రాక్ ను డ్రైవ్ చేస్తాడో చూడాలి. అన్నట్టు సినిమాలో గోపీచంద్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ సంస్థ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా వేణు దోనేపూడి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించాల్సి ఉంది. అన్నట్టు ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ ని యూనిట్ పరిశీలసిస్తోందట. స్క్రిప్ట్ కి తగ్గట్లుగా ఈ టైటిల్ సరిపోతుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం :