‘హరిహర వీరమల్లు’ పరిస్థితేంటి ?

‘హరిహర వీరమల్లు’ పరిస్థితేంటి ?

Published on May 29, 2023 11:53 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా నుంచి అప్ డేట్ కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. నిజానికి ఈ నెలలో ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, పవన్ ఫుల్ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ నెలలో కూడా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం జూన్ నెలలో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు.

ఈ కొత్త షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్.. సినిమా మొత్తంలోనే హైలైట్ గా ఉంటుందట. అందుకే, ఈ షెడ్యుల్ కి ఎక్కువ డేట్స్ పట్టేలా ఉంది. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది.

ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు