‘హరిహర వీరమల్లు’ లో ఆమె కూడా !

‘హరిహర వీరమల్లు’ లో ఆమె కూడా !

Published on Dec 4, 2022 9:08 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. అయితే, ఈ సినిమా క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ సీక్వెన్స్ లో హీరోయిన్ కేథ‌రిన్ థ్రెసా కనిపించబోతుందని తెలుస్తోంది. ఆమె పాత్ర నెగిటివ్ అని, సినిమాలో కీలకమైన పాత్ర అని కొత్తగా రూమర్ వినిపిస్తోంది. పవన్ పాత్రను మోసం చేసే పాత్రలోనే కేథ‌రిన్ థ్రెసా నటిస్తోందట. ఆమె పై ఓ సాంగ్ కూడా ఉంటుందట.

కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు