‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ వర్క్ షాప్ !

‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ వర్క్ షాప్ !

Published on Oct 2, 2022 5:25 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. అయితే, ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ప్రస్తుతం వర్క్ షాప్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ వర్క్ షాప్ లో మరో రెండు రోజుల పాటు పాల్గొననున్నాడు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ అక్టోబర్ మూడో వారం నుంచి స్టార్ట్ చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ కొత్త షెడ్యూల్ లో పవన్ పై కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు.

కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు