లేటెస్ట్..”వీరమల్లు” షూట్ రీస్టార్ట్ కి డేట్ ఫిక్స్.?

Published on Feb 14, 2022 7:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో తన కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా అయినటువంటి సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం దాదాపు 60 శాతం మేర షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా కరోనా వల్ల షూటింగ్ ఆగుతూ వస్తున్న ఈ చిత్రం కి ఎట్టకేలకు ఒక డేట్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది.

రానున్న మార్చ్ 18 నుంచి మేకర్స్ ఈ చిత్రం తాలూకా షూట్ ని రీస్టార్ట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టుగా టాక్ వినిపిస్తోంది. మరి ఈ షూట్ ని కూడా బీహార్ యాక్షన్ సీక్వెన్స్ తోనే స్టార్ట్ చేస్తారని బజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :