“హిట్ 2” హిందీ రిలీజ్ పై సాలిడ్ క్లారిటీ.!

“హిట్ 2” హిందీ రిలీజ్ పై సాలిడ్ క్లారిటీ.!

Published on Nov 29, 2022 9:59 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ ఆడియెన్స్ మంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న థ్రిల్లర్ చిత్రం “హిట్ 2”. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తన హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా రెండో చిత్రంగా తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లతో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంపై అయితే లేటెస్ట్ సాలిడ్ క్లారిటీ బయటకి వచ్చింది.

గత కొన్ని రోజులు కితమే ఈ సినిమా హిందీ రిలీజ్ పై కూడా టాక్ రాగా ఇపుడు అయితే ఏ హిందీ రిలీజ్ పై హీరో అడివి శేష్ క్లారిటీ ఇచ్చాడు. లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే ఈ చిత్రానికి హిందీ రిలీజ్ కూడా ఉందని తాను కన్ఫర్మ్ చేసాడు.

మరి ఆల్రెడీ ఈ సినిమా హిందీ రిలీజ్ కోసం అక్కడ చాలా మంది అడిగారని దీనితో ప్లాన్ చేస్తామని శేష్ ముందే క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు అధికారికంగా అనౌన్స్ చేసాడు. తన మేజర్ చిత్రం కూడా ఈ ఏడాది హిందీలో మంచి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు