ఆ క్రేజీ సినిమాలో నయనతార విలన్, సమంత హీరోయిన్ !

Published on Nov 22, 2021 8:33 pm IST

విజయ్ సేతుపతి హీరోగా, సమంత నయనతార కీలక పాత్రల్లో దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా నిర్మాత కూడా నయనతారనే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. అయితే, ఈ సినిమా కోసం నయనతార విలన్ గా నటిస్తోంది. అలాగే సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది.

ఇక ఈ సినిమా కథ ఓ వెరైటీ లవ్ స్టోరీ ఆధారంగా రాబోతుందని తెలుస్తోంది. కాగా విఘ్నేష్ శివన్ లో మంచి కామెడీ స్టైల్ ఉంది. ఆ కోణంలోనే ఈ సినిమా కూడా ఫన్నీగా ఉంటుందట. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాలి. అయితే, సినిమా అనౌన్స్ చేసిన తర్వాత సడెన్ గా కరోనా రావడం, అంతలో లాక్ డౌన్ పెట్టడం.. దాంతో ఈ సినిమా షూట్ మొదలవడం లేట్ అయింది.

సంబంధిత సమాచారం :