కమల్ – మణిరత్నం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

కమల్ – మణిరత్నం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Nov 9, 2022 2:59 PM IST


మన దక్షిణాది సినిమా దగ్గర ఎవర్ అండ్ ఫరెవర్ గ్రీన్ కాంబోస్ లో లోకనాయకుడు కమల్ హాసన్ మరియు లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ల కాంబినేషన్ ఒకటి. మరి వీరి నుంచి వచ్చిన “నాయగన్” చిత్రం అయితే ఇప్పటికీ ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. మరి మళ్ళీ ఎన్నో దశాబ్దాల తర్వాత వీరి ఇద్దరి కలయిక లో సినిమా అనే అనౌన్సమెంట్ వచ్చే సరికి ఒక్కసారిగా మూవీ లవర్స్ కి పాత రోజులు గుర్తుకొచ్చాయి. మరి ఈ చిత్రంపై అయితే లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోలీవుడ్ సినీ వర్గాల నుంచి బయటకి వచ్చింది.

మరి ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా అయితే వచ్చే ఏడాది జనవరి నెల నుంచే షూటింగ్ స్టార్ట్ చేసుకోనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ కలయికలో మరో సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదెప్పుడు కంప్లీట్ అయ్యి థియేటర్స్ లోకి వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ నే సంగీతం అందిస్తుండగా కమల్ హాసన్ నే తన సినిమా బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మాణం వహించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు