‘ఇండియన్ 2’ వివాదాలకు దారి తీస్తోందా ?

Published on Mar 27, 2023 9:10 am IST

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. కాగా ఎన్నో అడ్డంకులను అధిగమించి మళ్ళీ మొదలైన ఈ సినిమా పై కోలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ రాజకీయాల పై చెప్పే డైలాగ్స్ చాలా బోల్డ్ గా ఉంటాయని.. ముఖ్యంగా సౌత్ రాజకీయ నాయకుల పై కూడా కమల్ హాసన్ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తాడని తెలుస్తోంది. మరి ఇండియన్ 2 ఎన్ని వివాదాలకు దారి తీస్తోందో చూడాలి.

అలాగే ఈ సినిమా ఇంటర్వెల్ లో కమల్ హాసన్ నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. ముఖ్యంగా ఎనభై ఏళ్ల లుక్ లో కమల్ నటన అద్భుతంగా ఉంటుందని.. ఇంటర్వెల్ అదిరిపోతుందని.. థియేటర్స్ లో ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా కమల్ హాసన్ యాక్టింగ్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సీక్వెన్స్ లో కమల్ హాసన్ చెప్పే డైలాగ్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయట.

కాగా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక భారతీయుడు 2 రన్ టైం 3 గంటలకు పైనే నిడివి ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ ఈ నిడివిని కూడా తగ్గించే పనిలో ఉన్నారట.

సంబంధిత సమాచారం :