‘భారతీయుడు-2’ క్లైమాక్స్ లో క్రేజీ ట్విస్ట్

‘భారతీయుడు-2’ క్లైమాక్స్ లో క్రేజీ ట్విస్ట్

Published on Jul 7, 2024 5:40 PM IST

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘భారతీయుడు-2’. ఈ సినిమా ఈ నెల 12న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐతే, ఇప్పటికే, ‘ఇండియన్ 3’ ను కూడా తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 2’ క్లైమాక్స్ పై ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది.

ఈ క్లైమాక్స్ ప్రతి ఒక్కరు థ్రిల్‌ అయ్యే ఎలిమెంట్స్ తో ఉంటుందని.. పైగా ‘ఇండియన్ 3’ కి లీడ్ గా మరో కొత్త పాత్రను పరిచయం చేస్తారని.. ఆ పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరు అనేది చూడాలి. కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, SJ సూర్య, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని మరియు బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు