ఎన్టీఆర్ సినిమా పై ఆ ముగ్గురితో చర్చలు !

Published on Nov 15, 2021 12:00 am IST


‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఓ అప్డేట్ తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయింది. అయితే, స్క్రిప్ట్ లోని ఫైనల్ వెర్షన్ తాలూకు కొన్ని సీన్స్ పై చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో రచయితలు శ్రీధర్ సీపాన, వేమా రెడ్డిలతో పాటు సీనియర్ రైటర్ సత్యానంద్ కూడా కూర్చుంటున్నారట.

అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేరియేషన్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫుల్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే ఈ చిత్రం కోసం కొరటాల నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :