నిలకడగా “లతా మంగేష్కర్” ఆరోగ్యం

నిలకడగా “లతా మంగేష్కర్” ఆరోగ్యం

Published on Jan 18, 2022 6:27 PM IST


ప్రముఖ లెజెండరీ సింగర్ అయిన లతా మంగేష్కర్ కరోనా వైరస్ మహమ్మారి భారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ముంబై లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ప్రకారం, లతా జీ ఆరోగ్యం నిలకడగా ఉంది. కానీ ICU లోనే ఉన్నారు. మరో పది రోజుల పాటు ఆమె ఐసీయూలోనే ఉంటుందని వైద్యులు వెల్లడించారు.

ఇన్‌ఫెక్షన్‌లు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయని, అయితే వయసు రీత్యా ఆమె కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు