“మహేష్28” మాస్ గ్లింప్స్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on May 26, 2023 12:00 pm IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న అవైటెడ్ సినిమా మాస్ గ్లింప్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రంని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో అయితే హ్యాట్రిక్ చిత్రంగా వస్తుండగా భారీ అంచనాలు నెలకొల్పుకోగా ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ మాస్ ట్రీట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ చిత్రం గ్లింప్స్ విషయంలో అయితే లేటెస్ట్ టాక్ ఒకటి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో కంప్లీట్ అయ్యింది కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫైనలైజ్ కావాల్సి ఉందట. దీనితో ఈ వీడియో తాలూకా వర్క్స్ ఇంకా బ్యాలన్స్ ఉన్నాయనే చెప్పాలి. కానీ ఆన్ టైం అయితే ఈ వీడియో మాత్రం వస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :