మహేష్, త్రివిక్రమ్ ల సాలిడ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jan 31, 2022 10:55 am IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియన్ రేంజ్ లోకి వెళ్లనుంది.

అయితే ఈ లైనప్ లో రాజమౌళితో ఓ భారీ సినిమా చెయ్యాల్సి ఉండగా దాని కన్నా ముందు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక భారీ ప్రాజెక్ట్ చెయ్యడం కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనిని కూడా పాన్ ఇండియా ఫ్లిక్ గానే ప్లాన్ చేసిన మేకర్స్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో ఉండగా ఈ బిగ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ వచ్చే ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేయనున్నారట. అలాగే వచ్చే మార్చ్ నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :