ఇందిరా దేవి గారి అంత్యక్రియలపై లేటెస్ట్ సమాచారం.!

Published on Sep 28, 2022 9:03 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారి అకాల మరణంతో ఇప్పుడు ఘట్టమనేని వారి ఇంట సహా టాలీవుడ్ లో తీరని విషాదం ఈ ఉదయం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనితో ఈ విషాద సమయంలో మెగాస్టార్ చిరంజీవి సహా ఎందరో సినీ ప్రముఖులు మహేష్ మరియు కృష్ణ గార్లకి ధైర్యం చెబుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఇందిరా దేవి గారి అంత్యక్రియలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే ఇపుడు తెలుస్తుంది. ఇందిరా దేవిగారి పార్థివ దేహాన్ని అయితే ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోస్ లోనే ఉంచగా తరువాత హైదరాబాద్, జూబ్లీ హిల్స్ లో మహాప్రస్థానంలో వారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సంబంధిత సమాచారం :