మహేష్ నాన్ స్టాప్ షెడ్యూల్.. డేట్ ఫిక్స్ !

మహేష్ నాన్ స్టాప్ షెడ్యూల్.. డేట్ ఫిక్స్ !

Published on Nov 7, 2022 9:00 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఐతే, నవంబర్ మూడో వారం నుంచి మహేష్ – త్రివిక్రమ్ సినిమా సెట్ మీదకు వెళ్లనుంది. మూడో వారం నుంచి స్టార్ట్ అయ్యే షెడ్యూలు నాన్ స్టాప్ గా జరగనుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా షూట్ లో జాయిన్ కాబోతుంది. మహేష్ – పూజా లపై పెళ్లి సీన్ తీస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే, ఏప్రిల్ 28, 2023 న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ చిత్రం, తాజాగా ఏప్రిల్ నుంచి కూడా వాయిదా పడినట్లు టాక్ నడుస్తోంది. ఐతే, ఈ వార్త పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు హారిక & హాసిని క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు