మహేష్ క్యారెక్టర్ లో సాలిడ్ వేరియేషన్స్

మహేష్ క్యారెక్టర్ లో సాలిడ్ వేరియేషన్స్

Published on Feb 19, 2024 10:30 PM IST

స్టార్ దర్శకుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ సినిమా రాబోతుంది. ఐతే, ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని.. ముఖ్యంగా మహేష్ క్యారెక్టర్ లో సాలిడ్ వేరియేషన్స్ ఉంటాయని.. అందుకే, మొత్తం సినిమాలోనే మహేష్ క్యారెక్టరే మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.

అలాగే, మహేష్ ఈ సినిమా కోసం కొత్త లుక్ ను కూడా ట్రై చేస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటిస్తోంది అని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు