మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ బడ్జెట్ పై లేటెస్ట్ అప్డేట్

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్న మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ కాంబినేషన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబినేషన్ అనే చెప్పాలి. వీరి కలయికలో ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న నిరీక్షణకు ఎట్టకేలకి ఇప్పుడు సమయం వచ్చింది.

అయితే ఈ సినిమా విషయంలో ఉన్న ఎన్నో ఆసక్తికర అంశాల్లో దీని తాలూకా బడ్జెట్ కూడా ఒకటి. ఈ చిత్రానికి 1000 కోట్ల బడ్జెట్ అంటూ కొన్ని రూమర్స్ ఉన్నాయి. అయితే దీనిపై కొంచెం క్లారిటీ తెలుస్తుంది. ఈ సినిమాకి ఎలానో బడ్జెట్ ఎక్కువే కానీ 1000 కోట్లు అని ఇంత ఫిగర్ ఒకటి సెపరేట్ గా మేకర్స్ అనుకోలేదట.

నిర్మాత ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఇంత అంత అని కాకుండా ఎంతయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. సో అది 1000 కోట్ల పైన అయినా కావచ్చు లోపల అయినా కావచ్చని చెప్పాలి. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఈ రానున్న కొన్ని నెలల్లోనే మొదలు కానుంది అని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version