మ‌హేష్ తో మరో స్టార్ హీరోయిన్ ?

Published on Jun 4, 2023 6:05 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకు గుంటూరు కారం అన్ టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఏ స్టార్ హీరోయిన్ని అప్రోచ్ అవుతాడో.. ఎవరితో మహేష్ కి జోడిగా స్టెప్ లు వేయిస్తాడో చూడాలి. ఇక వచ్చే షెడ్యూల్ లో ఈ సాంగ్ ను షూట్ చేయనున్నారు. సహజంగా త్రివిక్రమ్ ప్రతి సినిమాలో హీరోయిన్ తో పాటు మరో హీరోయిన్ పాత్రను రాస్తుంటాడు. మరి మహేష్ కోసం ఈ సారి ఎలాంటి పాత్రను రాశాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం మిర్చి యాడ్ ను భారీ సెట్ గా వేసిన సంగతి తెలిసిందే.

ఇక మహేష్ – త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతుంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

సంబంధిత సమాచారం :