‘స్పైడర్’ రిలీజ్ డేట్ మళ్ళీ మారిందా ?


మహేష్ – మురుగదాస్ ల కలయికలో రూపొందుతున్న ‘స్పైడర్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, కొంత భాగం షూట్ మిగిలి ఉండటంతో విడుదల తేదీని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క ఆఖరి షెడ్యూల్ షూటింగ్ మే 3నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. ఆ షెడ్యూల్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ముగిసి సినిమా రిలీజుకు సిద్ధం కావాలంటే ఆగష్టు నెల పడుతుందని చిత్ర యూనిట్ చెబుతూ వచ్చారు.

కానీ ఆ ఆగష్టు నెలలో ఖచ్చితమైన విడుదల తేదీని మాత్రం చెప్పలేదు. నిన్న మొన్నటి వరకు ఆగష్టు 9న రిలీజ్ ఉంటుందని వార్తలు రాగా తాజాగా ఆ తేదీ కాస్త వెనక్కు వెళ్లి ఆగష్టు 11గా మారినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమాచారంపై కూడా పూర్తి స్థాయి గ్యారెంటీ లేదు. మరి ఫైనల్ గా మురుగదాస్ ఏ తేదీని ప్రకటిస్తారో చూడాలి. ఎస్. జె. సూర్య ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి హారీశ్ జైరాజ్ సంగీతం అందిస్తుండగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదలచేయనున్నారు.