మణిరత్నం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “పొన్నియన్ సెల్వన్ 1” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jul 2, 2022 4:01 pm IST

కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి మోస్ట్ అవైటెడ్ గా ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “పొన్నియన్ సెల్వన్ 1” అని చెప్పాలి. భారీ పీరియాడిక్ సినిమా అనే కాకుండా మన ఇండియన్ సినిమా దగ్గర ఒక బెస్ట్ ఫిల్మ్ మేకర్ అయినటువంటి మణిరత్నం నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవెల్లో అనేక అంచనాలు నెలకొన్నాయి.

మరి ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో చియాన్ విక్రమ్ సహా ఎందరో స్టార్స్ కలిపి నటిస్తుండగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ అందించారు. ఈ సినిమా యూనిట్ ఈ సెప్టెంబర్ 30 న విడుదలకి సిద్ధం అవుతుండగా ఇక నుంచి సినిమాపై అప్డేట్స్ మొదలు కాబోతున్నట్టుగా ఇపుడు అనౌన్స్ చేశారు.

అలాగే అతి త్వరలోనే టీజర్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ నుంచి మున్ముందు మంచి అప్డేట్స్ చూడొచ్చు. ఇంకా ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :