మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’లో మరో సీనియర్ నటుడు !

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’లో మరో సీనియర్ నటుడు !

Published on Oct 17, 2021 10:56 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో మరో సీనియర్ నటుడు ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ ఫాదర్ గా సీనియర్ నటుడు విజయ్ చందర్ నటిస్తున్నాడు. సీఎం పాత్రలో విజయ్ చందర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ కుష్బూ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా ఆమె పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. అయితే ఈ వార్తల పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక మోహన్ రాజా స్క్రిప్ట్ లో కూడా చాలా మార్పులు చేశాడు. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్‌ స్వరాలందిస్తుండగా.. నిరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు