“ఆచార్య” షూట్ పై సరికొత్త అప్డేట్.!

Published on Jul 25, 2021 7:50 pm IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “ఆచార్య” కోసం తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇప్పుడు అనేక సినిమాల్లానే ఇది కూడా షూటింగ్ చివరి స్టేజ్ కి వచ్చేసి కంప్లీట్ చేసుకునే దిశగా వెళుతుంది.

మరి లాస్ట్ షెడ్యూల్ పై గత వారమే అధికారిక అప్డేట్ ని కూడా మేకర్స్ వదిలారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం షూట్ పై మరో అప్డేట్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూట్ రేపటి నుంచి కాకినాడలో జరుపుకోనున్నట్టు తెలుస్తుంది. అలాగే సోనూ సూద్ పై కొన్ని కీలక సన్నివేశాలు ఇందులో ప్లాన్ చేసినట్టు టాక్.

ఇక ఈ సాలిడ్ చిత్రంలో రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :