మెగాస్టార్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.!

Published on Jan 28, 2022 8:00 am IST


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాము. అలాగే మన దేశంలో కూడా కేసులు అధిక స్థాయిలోనే నమోదు అవుతున్నాయి. అయితే అంతకంటే ఎక్కువగా ప్రముఖ సినీ తారలే అధికంగా పాజిటివ్ తేలుతూ ఉండడం కాస్త టెన్షన్ గా మారింది.

మరి రీసెంట్ గానే టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తాను కూడా టెస్ట్ లో పాజిటివ్ అయ్యానని తెలపడం షాక్ ఇచ్చింది. మరి అక్కడ నుంచి అభిమానులు మెగాస్టార్ కోలుకోవాలని అనేక ప్రార్ధనలు పూజలు కూడా స్టార్ట్ చేశారు. మరి తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ తెలుస్తుంది.

ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్న చిరు అపోలో డాక్టర్స్ పరిశీలనలో ఉన్నారట. మరి ప్రస్తుతానికి తక్కువ లక్షణాలతోనే స్థిరమైన ఆరోగ్యంలోనే ఉన్నారట. కాకపోతే కొద్దిగా జలుబు, ఒంటి నొప్పులు ఉన్నాయని తెలుస్తుంది. అంతే కాకుండా మరో రెండు వారాల్లో అలా చిరు తప్పకుండా పూర్తి స్థాయిలో కోలుకుంటారని సమాచారం.

సంబంధిత సమాచారం :