మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో కాకా సినిమా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. దాదాపు 75 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు టాక్. డిసెంబర్ మొదటి వారం లోపు ఈ సినిమా చిత్రీకరణను ముగించాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఈ పోలీస్ పాత్రలో నటిస్తున్నారట. పైగా ఈ సినిమాలో ఆయన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట.
ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ‘కాకా’ టీమ్ సంక్రాంతి విడుదల లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
