అక్కినేని హీరో నాగచైతన్య గత ఏడాది కాలంగా తన కొత్త సినిమా ‘వృషకర్మ’ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా బిజినెస్ కూడా భారీ ధరలకు అమ్ముడైపోయింది.
ప్రస్తుతం ఉన్న ఎండలను కూడా లెక్కచేయకుండా, చిత్ర యూనిట్ ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం రాజస్థాన్ వెళ్తోంది. అక్కడ జరిగే కీలకమైన సన్నివేశాల్లో నాగచైతన్య కూడా పాల్గొనబోతున్నాడు. మే చివరి నాటికి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి, ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
