నాగ చైతన్య వెబ్ సిరీస్‌పై లేటెస్ట్ అప్డేట్?

Published on Mar 10, 2022 2:25 am IST


అక్కినేని నాగచైతన్య తొలిసారిగా అమెజాన్ ప్రైమ్ కోసం “దూత” అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హర్రర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది.

ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం మూడు సీజన్లుగా రూపొందించబోతున్నారని, ఒక్కో సీజన్‌లో తొమ్మిది ఎపిసోడ్‌లు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే వస్తున్న వార్తల ప్రకారం రెండవ సీజన్ స్క్రిప్ట్ కూడా లాక్ చేయబడినట్టు తెలుస్తుంది. ఇక ఈ సిరీస్‌లో మళయాళ టాలెంటెడ్ యాక్ట్రెస్ పార్వతి మరియు ప్రియా భవాని శంకర్‌లు కూడా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలోనే “థ్యాంక్యూ” చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. దాదాపు షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :