విరూపాక్ష సినిమాతో పేరు తెచ్చుకున్న కార్తీక్ దండుతో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఓ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి కోసం కార్తీక్ దండు ఓ కీలక పాత్రను డిజైన్ చేశాడట. ఆయన పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. ఈ పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందట.
అన్నట్టు పూజా హెగ్డే ఈ చిత్రంలో నాగ చైతన్యతో కలిసి నటించబోతోంది. కాకపోతే, పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తోంది అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అక్టోబర్ నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) నిర్మించబోతుంది.
కాగా ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి డైరెక్షన్ లో రాబోతున్న భారీ చిత్రం “తండేల్”. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది.