రవితేజ సినిమాలో తొట్టెంపూడి వేణు?

Published on Feb 1, 2022 9:10 am IST

మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవితేజ, నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో కూడా ఓ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్ర మాజీ హీరోకి సెట్ అవుతుందని, అందుకే ఆ పాత్రలో యంగ్ హీరో తొట్టెంపూడి వేణు నటించబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతానికి అయితే తొట్టెంపూడి వేణు సినిమాల కోసం ఎదురు చూస్తున్నాడు.

మరి ఈ సినిమాలో తొట్టెంపూడి వేణు నటిస్తే కెరీర్ కి ప్లస్ అవుతుంది. కాగా ఈ సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందట. ముఖ్యంగా రవితేజ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. కిక్ సినిమాలోని రవితేజ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది. రవితేజ ఖిలాడి సినిమా కూడా రిలీజ్ రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :