మరో స్పెషల్ సాంగ్ లో అనసూయ ?

మరో స్పెషల్ సాంగ్ లో అనసూయ ?

Published on Oct 12, 2021 2:00 AM IST

మాస్ మహా రాజా రవితేజ – నక్కిన త్రినాధ్ రావ్ దర్శకత్వంలో రాబోతున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ లో అనసూయ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇప్పటికే అనసూయ కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది. మరి ఇదే రవితేజ సినిమాలో కూడా నటిస్తోందేమో చూడాలి.

కాగా ఈ సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందట. ముఖ్యంగా రవితేజ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. కిక్ సినిమాలోని రవితేజ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ అవుతూ ఎట్టకేలకు స్టార్ట్ అయింది. ఇక గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది. రవితేజ ఖిలాడి సినిమా రిలీజ్ రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు