నాని “దసరా” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్

నాని “దసరా” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్

Published on Dec 16, 2022 9:00 PM IST


అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దసరా. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాని తన కెరీర్‌లో తొలిసారిగా మాస్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా చివరి షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలాఖరులోగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

దసరా ఇప్పటి వరకు నాని కెరీర్ లోనే అతిపెద్ద చిత్రం. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయడానికి నాని అన్ని విధాలుగా కష్టపడుతున్నారు. ఈ చిత్రం సింగరేణి కాలరీస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు