మహాబలిపురంలో పెళ్లాడనున్న స్టార్ హీరోయిన్?

Published on May 29, 2022 2:00 pm IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పైగా వీరి ప్రేమాయణం మొదలైన దగ్గర నుంచి వీరి పెళ్లి అంటూ ఇప్పటికే అనేక రూమర్స్ వస్తున్నాయి. ఐతే, ఈ జంట కొన్నేళ్ల క్రితమే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరి పెళ్లి కబురు ఎప్పుడు వినిపిస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
కాగా ఈ లవ్ బర్డ్స్ జూన్‌ లో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో జూన్ 7వ తేదీన పెళ్లాడనున్నారు.

ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు అవుతారట. ఏది ఏమైనా ఎప్పటినుండో నయనతార పెళ్లి రూమర్లు అనేక సార్లు హడావుడి చేశాయి, కానీ నయనతార మాత్రం ఎప్పటిలాగే తన ప్రేమ మైకంలోనే ఉండిపోయింది. మొత్తానికి ఇన్నాళ్ళకు వీరిద్దరూ పెళ్లితో ఒక్కటవుతున్నారు. కాగా పెళ్లికి నయనతార తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారని.. అందుకే నయనతార కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :