ఎన్టీఆర్ “దేవర” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jun 9, 2023 3:00 pm IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తో భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ కూడా రాగ మేకర్స్ అయితే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమా షూట్ ని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది. ఈ సినిమాలో ఓ భారీ షెడ్యూల్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యిందట.

ఇక ఈ షెడ్యూల్ యాక్షన్ షెడ్యూల్ కాగా ఇందులో ఎన్టీఆర్ సహా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై అయితే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లను హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఇప్పుడు అలాగే ఓ స్టన్నింగ్ సీక్వెన్స్ ని అయితే డిజైన్ చేశారట. ఇక ఈ చిత్రానికి అయితే అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :