పవన్ పై సోలో సాంగ్ కోసం భారీ సెట్ ?

పవన్ పై సోలో సాంగ్ కోసం భారీ సెట్ ?

Published on Apr 19, 2022 12:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. అయితే, రేపటి నుంచి ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ లో పవన్ పై ఓ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ పాత్రను ఎలివేట్ చేస్తూ సాంగ్ షూట్ చేస్తారట. ఈ సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే ఓ భారీ సెట్ ను కూడా నిర్మించారని తెలుస్తోంది.

కాగా ఈ షెడ్యూల్ తో సినిమాలో కీలక భాగం షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట. ఇక ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా పాల్గొననుంది. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు