పవన్ “హరిహర వీరమల్లు” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Apr 6, 2022 3:30 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పవన్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ సినిమాగా తెరకెక్కుతుంది. మరి దాదాపు 60 శాతం మేర షూటింగ్ కంప్లీట్ చేసుకోగా మిగతా షూటింగ్ కోసం మేకర్స్ ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే పవన్ పొలిటికల్ పనుల మూలాన అలా ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగానే మొదలయ్యేలా కనిపిస్తుంది. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏప్రిల్ 8న స్టార్ట్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. పవన్ ఆల్రెడీ ఈ సినిమా లుక్ ని సిద్ధం చేసికొని ఉన్నారు. మరి ఈ డేట్ కి అయినా షూట్ మొదలవుతుందో లేదో చూడాలి. ఇంకా ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :