పవన్ “ఓజి” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Sep 23, 2023 2:01 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి సినిమా ఫస్ట్ గ్లింప్స్ తో పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. పవన్ లేని పోర్షన్స్ ని మేకర్స్ ఇన్ని రోజులు కంప్లీట్ చేయగా ఇప్పుడు అయితే సాలిడ్ అప్డేట్ ఈ సినిమా షూట్ కోసం తెలుస్తుంది.

ఈ అక్టోబర్ 27న ఓజి షూట్ కాకినాడ పోర్ట్ లో జరగనుంది అంటూ లేటెస్ట్ బజ్ ఒకటి వైరల్ గా మారింది. మరి ఇందులో పవన్ కూడా పాల్గొననున్నారని టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :