పవన్ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ లో సీనియర్ కమెడియన్ !

Published on Nov 29, 2021 8:07 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న మళయాలి సినిమా ‘అయ్యప్పనుం కోషియుం’. ఈ సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీరియస్ పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపించబోతున్నాడట. ఆయన పాత్ర రాజకీయ నాయకుడి పాత్ర అని, రాజేంద్రప్రసాద్ కి ఉన్న ఇనేజ్ కి పూర్తి భిన్నమైన పాత్రలో ఆయన ఈ చిత్రంలో నటించిబోతున్నాడని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సతీమణిగా నిత్య మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆ మధ్య రిలీజ్ అయిన పవన్ – నిత్యా పోస్టర్ కూడా చాలా బాగుంది. మొత్తానికి ఈ మాస్ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండబోతున్నాయి. ఇక భీమ్లా నాయక్ గా పవన్ , డ్యానియల్ శేఖర్ గా రానా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఈ సినిమా ఈగో మీద నడవబోతుంది. నువ్వా – నేనా అంటూ పోటీ పడే ఇద్దరి ఆవేశపరుల కథ ఇది. ఈ చిత్రాన్ని సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ కూడా పని చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :