‘ప్రభాస్ – మారుతి’ కామెడీ ఎంటర్ టైనర్ ఎప్పుడు ?

Published on Jun 20, 2022 7:13 pm IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అనే అంశాల పై ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత స్టార్ట్ అవుతుందని.. 2024 సంక్రాంతి స్పెషల్ గా ఈ చిత్రం రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, సబ్జెక్ట్ ఎక్కువగా స్థానికంగా ఉంటుందని, అలాగే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట.

అలాగే ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ప్రస్తుతానికి అయితే.. ఈ విషయాల పై ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ రావాల్సి ఉంది. కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే. ప్రస్తుతం మారుతి గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :