ప్రభాస్ మారుతీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Sep 16, 2023 11:08 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు మారుతితో చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ చిత్రం కూడా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా రీసెంట్ గా అయితే హీరోయిన్ మాళవిక మోహనన్ పై ఓ సీన్ వీడియో కూడా బయటకి వచ్చి వైరల్ అయ్యింది. ఇక చిత్రం విషయంలో అయితే లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.

మేకర్స్ ఈ సినిమాని ఇప్పటివరకు నలభై శాతం మేర కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో సినిమా ఓమాదిరిగా ప్రభాస్ ఇచ్చిన సమయంలో బాగానే లాక్కోచ్చేసారు అని చెప్పాలి. ఇక ఈ చిత్రం అయితే పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉండగా మేకర్స్ సాలిడ్ ఎలిమెంట్స్ తోనే తెరకెక్కిస్తున్నారు. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కావచ్చు.

సంబంధిత సమాచారం :