ప్రభాస్ హెల్త్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Sep 27, 2023 9:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేసిన భారీ చిత్రాలు కోసం చర్చ లేకుండా ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు రోజు గడవట్లేదు. తాను నటించిన సెన్సేషన్ ప్రాజెక్ట్ “సలార్” రిలీజ్ కోసం అంతా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ మధ్యలో అయితే ప్రభాస్ తన మోకాలి ఆపరేషన్ కోసం విదేశాలకి వెళ్లిన సంగతి తెలిసిందే. మరి ఈ సర్జరీ అయితే ఇప్పుడు విజయవంతంగా కంప్లీట్ అయ్యిందట.

కానీ ఇప్పుడు ప్రభాస్ ఇమీడియేట్ డిశ్చార్జ్ లేదని అక్కడే కొన్ని రోజులు రెస్ట్ మోడ్ లో ఉండాలని తెలుస్తుంది. హాస్పిటల్ లోనే ప్రభాస్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని ఆ తరువాత ఇండియాకి చేరనున్నాడు. అలాగే మరి అప్డేట్ ప్రకారం ప్రభాస్ అయితే నవంబర్ వరకు కంప్లీట్ రెస్ట్ లో ఉండి అక్కడ నుంచి అయితే మళ్ళీ తన సినిమాల షూటింగ్ లో పాల్గొననున్నాడని వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :