ఫైనల్ గా “కల్కి” బుకింగ్స్ పై లేటెస్ట్ అప్డేట్

ఫైనల్ గా “కల్కి” బుకింగ్స్ పై లేటెస్ట్ అప్డేట్

Published on Jun 23, 2024 11:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోన్ అలాగే దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్, కమల్ లాంటి దిగ్గజాలు కూడా నటిస్తుండగా ఇప్పుడు వరకు వచ్చిన ట్రైలర్ లకి సెన్సేషనల్ రెస్పాన్స్ నమోదు అయ్యింది.

అయితే సినిమా విడుదల సమయం దగ్గరకి వస్తుంది కానీ మన దగ్గర అసలు ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఫైనల్ గా దీనిపై అప్డేట్ వినిపిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈరోజు జూన్ 23 సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఆన్లైన్ లో మొదలు కానున్నాయట. నిన్న ఎలాగో రెండు తెలుగు రాష్ట్రాల టికెట్ రేట్ లు కూడా ఖరారు అయిపోయాయి. సో ఈరోజే బుకింగ్స్ మొదలు కానున్నాయి. మరి ఈసారి రెస్పాన్స్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు